AP: ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన ఘటన కడప జిల్లాలో జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన భువనేశ్వరి అనే మహిళ కూల్‌డ్రింక్‌లో విషం కలిపి పిల్లలకు తాగించింది. అనంతరం తాను విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. అత్తతో జరిగిన గొడవల కారణంగా ఈ ఘాతుకానికి యత్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.