WGL: ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ సివిల్ సప్లై గోదాం ఇంఛార్జ్ దుర్గం లచ్చయ్య గురువారం మరణించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపట్ల మండలంలోని పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు.