ATP: ఉరవకొండ మండలం చిన్న ముష్టురు గ్రామానికి చెందిన రైతు సురేశ్ (35) అప్పుల బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి 2 ఎకరాల సొంత భూమి ఉండగా, మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నాడు. సాగు చేసిన పంటలు దిగుబడి రాకపోవడంతో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసు దర్యాప్తు చేపట్టారు.