ప్రకాశం: పొన్నలూరు మండలం రావలకొల్లు పరిసరాలలో డ్రోన్ నిఘా గురువారం ఎస్ఐ సత్యనారాయణ కొనసాగించారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల భద్రత ప్రధాన లక్ష్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోలీస్ శాఖ పనిచేస్తుందని సత్యనారాయణ చెప్పారు. ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని కోరారు.