NGKL: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా గురువారం పాత కలెక్టరేట్ భవనం 102 గదిలో నిర్వహించిన కంటి చికిత్స శిబిరం విజయవంతమైనట్లు నాగర్ కర్నూల్ జిల్లా అంధత్వ ప్రోగ్రాం అధికారి డాక్టర్ హెచ్.ప్రదీప్ తెలిపారు. ఈ శిబిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 86 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో అర్హులైన క్యాటరాక్ట్ పొరగల 41 మందిని గుర్తించామన్నారు.