AP: విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో మరోవ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఏ4గా ఉన్న దిల్కష్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులైన షరీఫ్, డానిష్, సొహైల్ బేగ్ అనే ముగ్గురు యువకులతో పాటు మరో మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.