NLR: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. జమ్మూలోని కట్రాలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మాతా వైష్ణో దేవి అమ్మవారిని గురువారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అవసరాల నిమిత్తం తమ వంతు సహాయంగా రెండు వాహనాలను విరాళంగా అందజేశారు.