MBNR: జిల్లా కేంద్రంలో అక్షయపాత్ర ఐదు రూపాయల భోజనం షెడ్‌ను మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలకు ఆహారం వడ్డించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎంతోమంది కార్మికులు, పేద ప్రజలు ఉపాధి కోసం వచ్చి మధ్యాహ్న భోజనం తీసుకోలేని వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.