AP: ప్రకాశం జిల్లా మార్కాపురం బస్సు ప్రమాదస్థలంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రైవేట్ బస్సులో నిబంధనలకు విరుద్ధంగా 5 కేజీల గ్యాస్ సిలిండర్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సిలిండర్ వల్లే మంటలు వేగంగా వ్యాపించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు దీన్ని తీసుకువచ్చారు అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.