SDPT: హుస్నాబాద్‌లో విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ఆర్టిసన్ కార్మికులు ధర్నా నిర్వహించారు. సుమారు 19 వేల మంది కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జేఎల్ఎం, సబ్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్ పదోన్నతులు కల్పించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే వచ్చే నెల 8లోపు రాష్ట్రవ్యాప్తంగా మెరుపు సమ్మె చేపడతామని హెచ్చరించారు.