Ramgopal varma: పవన్ కంటే బర్రెలక్క ఎంతో బెటర్: ఆర్జీవీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క ఎంతో బెటర్ అని టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. తెలంగాణ ఎన్నికల వేళ పవన్ సభ కంటే బర్రెలక్క సభ ఎంతో బెటర్‌గా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన నెట్టింట ఓ వీడియోను షేర్ చేశారు.
తెలంగాణ (Telangana)లో ఎన్నికల ప్రచారం (Elections Campaign) జోరందుకుంది. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ (Telangana Politics) అంటే బర్రెలక్క పేరే ఎక్కువగా వినిపిస్తోంది. చాలా మంది ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు. నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై బర్రెలక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎన్నికల బరిలో నిలిచారు. అటువంటి బర్రెలక్క (Barrelakka)కు రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు అండగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ramgopal Varma) సైతం బర్రెలక్కపై సంచలన కామెంట్స్ చేశారు.
ఆర్జీవీ షేర్ చేసిన వీడియో:
Never seen a more disinterested and more careless campaign more than @PawanKalyan ‘s in telangana😳 Neither him nor the organisers seem to bother even about the Mike sound from which he is speaking … Compared to him Barrelakka’s is far better https://t.co/YupPwSfnRt
సోషల్ మీడియా వేదికగా రామ్ గోపాల్ వర్మ (Ramgopal varma) మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ప్రచారంపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో పవన్ పాల్గొన్న సభలో జనసంద్రం అంతగా కనిపించలేదని, పైగా ఆయన మాట్లాడేటప్పుడు మైక్ సౌండ్ కూడా సరిగా వినిపించలేదన్నారు. ఆ విషయాన్ని అక్కడున్నవారు ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు.
పవన్ కళ్యాణ్‌తో పోలిస్తే బర్రెలక్క (Barrelakka) ఎంతో బెటర్ అని ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. తాండూరు సభలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం (Elections Campaign)లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పవన్ మైక్ నుంచి సౌండ్ సరిగా వినిపించలేదు. ఆ వీడియోను పోస్ట్ చేస్తూ ఆర్జీవీ కామెంట్స్ (RGV Comments) చేశారు. ప్రస్తుతం ఆర్జీవీ పోస్ట్ చర్చనీయాంశమైంది.