GNTR: కోయవారిపాలేనికి చెందిన చిన్నం శివమ్మ తన తల్లితో కలిసి మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అధికారులు తన పింఛన్‌ను అకారణంగా నిలిపివేశారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. తాను టీడీపీ మద్దతురాలినని, ఓ జనసేన నాయకుడు కక్షకట్టి తనపై ఫిర్యాదులు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఫిర్యాదుల వల్లే అధికారులు తన పింఛన్ ఆపేశారని, న్యాయం చేయాలని కోరారు.