ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. మెగా బ్రదర్స్‌తో ఉన్న ఫొటోలు పంచుకుంటూ.. 15 ఏళ్ల క్రితం ఈ పెద్ద కుటుంబంలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలో అర్థం కాలేదన్నారు. భర్త సహకారంతో అంతా నేర్చుకున్నానని, తనకు సోదరులు లేరని, చిరంజీవి, నాగబాబుల్లోనే తన అన్నయ్యలను చూసుకుంటున్నానని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.