సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఈ ప్రపంచంలో ఏం జరిగినా అది క్షణాల్లో అందులోకి వచ్చేస్తోంది. ప్రపంచంలో ఏ నలుమూల అయినా సరే.. చీమ చిటుక్కుమన్నా వెంటనే సోషల్ మీడియాలో తెలియాల్సిందే. నేటి జనరేషన్ మొత్తం సోషల్ మీడియాలోనే ఉంటుంది కదా. అందుకే.. లేని పోని స్టఫ్ మొత్తం అందులో దొరుకుతుంది. తాజాగా ఓ తండ్రి తన కొడుక్కి స్పూన్ తో హెయిర్ కట్ చేశాడు. అసలు అలా ఎలా సాధ్యం అవుతుంది అనే కదా మీ డౌట్. కానీ.. స్పూన్ తోనే కొడుకుకు అద్బుతమైన హెయిర్ కట్ చేసి నెటిజన్ల ప్రశంసలు పొందాడు ఆ తండ్రి.
బాలుడు కెమెరా ముందు కుర్చీలో కూర్చున్నాడు. అతడి తండ్రి స్పూన్ పట్టుకొని వచ్చాడు. ఏం చక్కా బ్లేడ్, కత్తెరతో కట్ చేసినట్టుగా స్పూన్ తో అవలీలగా హెయిర్ కట్ చేసేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అసలు ఇదంతా నిజమేనా.. స్పూన్ తో ఎలా హెయిర్ కట్ చేస్తారు అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. గొప్పోడివి బాసు నువ్వు.. రూపాయి ఖర్చు లేకుండా మీ అబ్బాయికి హెయిర్ కట్ చేశావు.. అది ఎంతో అందంగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.