AP: మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 10 మంది సజీవదహనం అయిన విషయం తెలిసిందే. ప్రమాద స్థలానికి చేరుకున్న మార్కాపురం డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ.. ‘ఇంకా బస్సులోనే మృతదేహాలు ఉన్నాయి. మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాం. గాయాలైనవారికి మార్కాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు’ అని పేర్కొన్నారు.