MBNR: ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ప్రచార రథాన్ని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ప్రచార రథం ద్వారా సౌర శక్తి వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇండ్లపై సౌరశక్తి పలకలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.