BDK: రక్తదానం చేయడానికి యువత పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ పిలుపునిచ్చారు. తద్వారా ప్రమాదంలో ఉన్న వారికి సకాలంలో రక్తం అంది ప్రాణాలు దక్కుతాయని చెప్పారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు జె. బాలు ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో గల కొత్తగూడెం ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.