మేడ్చల్ జిల్లా లోని శామిర్ పేటలో కాల్పలు కలకలం రేపాయి. ముడు చింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో వైన్ షాప్ వద్ద దుండుగులు కాల్పలు జరిపారు. తుపాకులతో బెదిరించి రూ 2లక్షలు చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని మద్యం దుకాణం వద్దకు రాత్రి మాస్క్ లు ధరించి ముగ్గురు దుండగులు వచ్చారు. క్యాషియర్ తో పాటు మరో ఇద్దరిపై కర్రలతో దాడి చేశారు. తుపాకీతో బెదిరించి రూ.2 లక్షలను దుండగులు చోరీ చేశారు. మద్యం దుకాణం సిబ్బంది తిరగడబటంతో తుపాకీతో దుండగులు కాల్పులు జరిపారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో తుపాకీ తూటా షట్టర్ కు తగిలింది. ఆ తర్వాత డబ్బులతో దుండగులు పరారవుతుండగా సిబ్బంది పెద్దగా కేకలు వేశారు.