NZB: పశువుల ఆరోగ్య రక్షణ కోసం గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు సూచించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన గోడ ప్రతులను ఆయన ఆవిష్కరించారు. పాడి రైతుల ముంగిటకే వెళ్లి టీకాలు వేసేలా ప్రత్యేక మొబైల్ వాహనాన్ని ప్రారంభించి, వేసవిలో వ్యాధుల నివారణకు రైతులు సహకరించాలని కోరారు.