HNK: కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ హసన్పర్తి మండల అధ్యక్షుడిగా మేకల ఉపేందర్ నియమితులయ్యారు. ఈ నియామకపత్రాన్ని కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్ చేతులమీదుగా బుధవారం అందుకున్నారు. ఉపేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పట్ల తన నిబద్ధతను గుర్తించి ఈ అవకాశం కల్పించినందుకు ఆనందంగా ఉందన్నారు. పార్టీ బలోపేతానికి మరింత ఉత్సాహంగా పనిచేస్తానన్నారు.