కడప: నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర జడ్పీ ప్రాంగణంలోని అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంటీన్లో అందిస్తున్న భోజనాన్ని స్వయంగా తీసుకుని ప్రజలతో కలిసి భోజనం చేశారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత, వంట విధానాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. లబ్ధిదారులతో మాట్లాడి సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.