PDPL: పెద్దపల్లి టాస్క్ సెంటర్లో ఇవాళ నిర్వహించిన ఉద్యోగమేళాకు భారీ స్పందన లభించింది. కలెక్టర్ శ్రీ హర్ష ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. టాస్క్ సెంటర్ ద్వారా అనేక నైపుణ్య కోర్సులలో శిక్షణ అందిస్తూ, ఉపాధి లభించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. జాబ్ మేళా వంటి కార్యక్రమాలను నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని సూచించారు.