SKLM: మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు విషయంలో న్యాయం గెలిచిందని, నిజాయితీ నిలబడిందని టీడీపీ నాయకుడు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు బుధవారం కూర్మారావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు తీసుకున్న చొరవ అభినీయమన్నారు. కమిషనర్‌కు రీపోస్టింగ్ శ్రీకాకుళంలోనే రావడానికి సహకరించిన మంత్రి అచ్చెన్నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు.