»Virat Kohli Signature Jersey Gift To Netherlands Player Viral Video
Viral video: నెదర్లాండ్స్ ఆటగాడికి కోహ్లీ గిఫ్ట్
నిన్న బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023 చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నెదర్లాండ్ ఆటగాడికి ఓ బహుమతి ఇచ్చాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
virat Kohli signature jersey gift to Netherlands player Viral video
ODI ప్రపంచకప్ 2023లో నిన్న ఆదివారం నెదర్లాండ్స్‌పై టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచులో భారత టాప్-ఆర్డర్ బ్యాటర్లు, బౌలర్లు సమిష్టి కృషిని ప్రదర్శించారు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ నడుమ ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారత్ విజయం తర్వాత విరాట్(virat Kohli) తన సంతకం చేసిన జెర్సీని(jersey) నెదర్లాండ్స్ ఆల్ రౌండర్ రోలోఫ్ వాన్ డెర్ మెర్వేకి బహుమతిగా ఇచ్చాడు. ఆ క్రమంలో విరాట్ నెదర్లాండ్స్ ఆటగాడిని హత్తుకునే క్షణం వీడియోలో చూడవచ్చు. విరాట్ వాన్ డెర్ మెర్వేని కౌగిలించుకుని చిరునవ్వుతో ఉన్న ఆ క్షణాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోను ICC అధికారిక హ్యాండిల్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయగా..ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. అయ్యర్ ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ లో 94 బంతుల్లో 128 పరుగులు, రాహుల్ 64 బంతుల్లో 102 పరుగులతో విధ్వంసక స్కోర్ చేయగా.. భారత్ 50 ఓవర్లలో 410/4 స్కోర్ సెట్ చేసింది. మరోవైపు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కూడా భారత్(bharat) భారీ స్కోర్‌ని సెట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ధీటుగా పోరాడినా చివరికి 47.5 ఓవర్లలో 250 పరుగులకే ఆలౌటైంది. అయితే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ నేతృత్వంలోని భారత బౌలింగ్ ధాటికి నిర్ణీత వ్యవధిలో కీలక వికెట్లు తీశారు. భారత బౌలర్ల సమిష్టి కృషి నెదర్లాండ్స్‌ను 250 పరుగులకే పరిమితం చేసి, 160 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
ఇక లీగ్ దశలో తొమ్మిది విజయాలతో అజేయంగా నిలిచిన భారత్ బుధవారం (నవంబర్ 15) ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగే సెమీ-ఫైనల్ పోరు కోసం ఎదురుచూస్తోంది. ప్రధానంగా 2019 ప్రపంచ కప్, 2021లో జరిగిన ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(icc odi world cup 2023) ఫైనల్లో టీమిండియాకు ఎదురుదెబ్బలు తగులగా ఈసారి ఆ సవాళ్లను అధిగమించాలని భారత్ భావిస్తోంది.