»A Lion Roared In The Streets Of Italy In The Middle Of The Night The Video Went Viral
Ladispoli : ఇటలీ వీధుల్లో ఆర్ధరాత్రి సింహం హల్చల్..వీడియో వైరల్
ఇటలీలో ఓ సింహం రాత్రి వేళ వీధుల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాడిస్పోలీ అనే టౌన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
సింహాలు (Lions) సాధారణంగా అడవులో, అభయారణ్యాల్లో కనిపిస్తాయి.లేదా జంతు ప్రదర్శనశాల్లో దర్శనమిస్తాయి.అయితే ఇటలీలో ఓ సింహం రాత్రి వేళ వీధుల్లో స్వేచ్చగా విహరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతుంది. స్థానికంగా ఉన్న ఓ సర్కస్ కంపెనీ (Circus Company) నుంచి ఈ సింహం తప్పించుకుంది. దీంతో, అక్కడి మేయర్ స్థానికులను అప్రమత్తం చేశారు. సింహాన్ని మళ్లీ బంధించేంత వరకూ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.
దీంతో, ఇళ్లల్లోనే ఉండిపోయిన ప్రజలు సింహం తమ వీధిలోకి (Street) రావాలని కోరుకున్నారు. కొందరి కోరిక నెరవేరి సింహం రాజసంగా నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు కొందరి కంట పడ్డాయి. చివరకు ఈ వీడియోలు నెట్టింట బాటపట్టాయి. లాడిస్పోలీ(Ladispoli)అనే టౌన్లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. సింహరాజాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోతూనే ఆవేదన కూడా వ్యక్తం చేశారు. తమ జీవితంలో తొలిసారిగా సింహం స్వేచ్ఛ అనుభవించడం చూసి అనేక మంది సంతోషించారు. మృగరాజాన్ని ఈ కాలంలోనూ బోనులో పెట్టడం అమానుషమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కొన్ని గంటల పాటు శ్రమించిన భద్రతా సిబ్బంది సింహాన్ని బంధించి సర్కస్‌కు అప్పగించారు.
ITALY 🇮🇹 Lion roams through small Italian town of Ladispoli near Rome after escaping from the circus.
The predator roamed the streets of the city of 40,000 inhabitants north of Rome. The police, together with the circus staff, tried to recapture the lion – but initially… pic.twitter.com/FNNMQOQHMZ