»Rohit Sharma Holds The Record As The Captain Who Hit The Most Sixes
Rohit Sharma: అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డ్
నేటి వరల్డ్ కప్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టుతో టీమిండియా తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు రికార్డులు బద్దలు కొట్టాడు. అత్యధిక సిక్స్‌లు కొట్టిన కెప్టెన్‌గా, ఒకే ఏడాదిలో అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్‌గా రికార్డులు నెలకొల్పాడు.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అత్యధిక సిక్సులు కొట్టిన కెప్టెన్‌గా రికార్డుకెక్కాడు. వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీలో రోహిత్ శర్మ సిక్స్‌ల రికార్డును సృష్టించాడు. ఒకే కేలండర్ ఏడాదిలో వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గాను, కెప్టెన్‌గానూ చరిత్ర నెలకొల్పాడు. ఇన్ని రోజులూ ఆ రికార్డు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ అయిన ఏబీ డివిలియర్స్ పేరుపై ఉండేది. నేటి ప్రపంచకప్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టుతో టీమిండియా తలపడుతోంది.
ఈ మ్యాచ్‌లో రెండో సిక్స్ కొట్టినప్పుడే రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పడం విశేషం. 2023లో వన్డే క్రికెట్లో రోహిత్ శర్మ 59వ సిక్స్ కొట్టి ఆ ఘనతను సాధించాడు. ఇది వరకూ 58 సిక్స్‌లతో ఏబీ డివిలియర్స్ పై ఆ రికార్డు ఉండేది. ఆ రికార్డును హిట్ మ్యాన్ బ్రేక్ చేశాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ మరో రికార్డును క్రియేట్ చేశాడు.
50 సిక్స్‌లు కొట్టడంతో రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన వ్యక్తిగా రికార్డుకెక్కాడు. గతంలో ఆ రికార్డు క్రిస్ గేల్‌పై ఉండేది. 2015లో ఏబీ డివిలియర్స్ 18 వన్డే ఇన్నింగ్స్ లల్లోనే 58 సిక్స్‌లు కొట్టగా, 2019లో క్రిస్ గేల్ 15 ఇన్నింగ్స్‌ల్లోనే 56 సిక్స్‌లు కొట్టాడు. ఆ తర్వాత షాహిద్ అఫ్రిది 2002లో 36 ఇన్నింగ్స్ లల్లో 48 సిక్సులతో ఉన్నాడు.
నెదర్లాండ్స్ జట్టుతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 54 బంతులకు 61 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అందులో 8 ఫోన్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ప్రస్తుతం క్రీజ్‌లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. అంతకుముందు శుభ్‌మన్ గిల్ 51 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.