వన్డే ప్రపంచకప్‌లోని నేటి మ్యాచ్‌లో పాక్ ఘోరంగా విఫలమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ పై ఇంగ్లండ్ జట్టు ఘన విజయం సాధించింది. 338 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్థాన్ 43.3 ఓవర్లలో 244 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. పాకిస్థాన్ బ్యాటర్లలో ఆగా సల్మాన్ 51, పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ 38, మహ్మద్ రిజ్వాన్ 36 పరుగులు చేశారు. మిగిలిన వారంతా బ్యాటింగ్‌లో విఫలమయ్యారు.
ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మొయిన్ అలీలు చెరో రెండు వికెట్లు తీయగా గుస్ అట్కిన్సన్ ఓ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. పాక్ పై విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ జట్టు ఏడో స్థానంలో నిలిచింది. ఇకపోతే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ లీగ్ దశలో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్‌తో నెదర్లాండ్స్ జట్టు ఢీకొనబోతోంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేయగా ఆ టార్గెట్‌ను పాక్ చేరుకోలేపోయింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్‌స్టోక్స్ 84, జో రూట్ 60, బెయిర్ స్టో 59 పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3 వికెట్లు తీయగా మహ్మద్ వసీం జూనియర్, షాహీన్ అఫ్రిది చెరో రెండు వికెట్లను తమ ఖాతాలో వేేసుకున్నారు.