KRNL: ఆస్పరి మండలంలో బుధవారం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పర్యటించారు. మండలంలోని గ్రామాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్యలను ప్రజలు వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తమ సమస్యలు వినిపించుకున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు.