GDWL: నమూనా ఐక్యరాజ్య సమితి (మోడల్ యూఎన్) సర్వసభ్య సమావేశాలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. బుధవారం గద్వాల కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 193 సభ్య దేశాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇది ఒక ఉత్తమ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.