Hyderabad CP: సోషల్ మీడియాతో ఏదైనా సరే ఇట్టే తెలిసిపోతుంది. విషయం తెలియడం వరకు ఓకే.. కొన్ని సందర్భాల్లో చెడు కూడా జరుగుతుంది. అమ్మాయిలతో చాట్ చేస్తూ.. సైబర్ కేటుగాళ్లు బెదిరించి, లొంగదీసుకుంటున్నారు. అలాంటి రెండు ఘటనలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య (Hyderabad CP) వివరించారు. గుర్తు తెలియని వారితో చాటింగ్ చేయొద్దని సూచించారు.
సైబర్ నేగరాళ్లు ఫొటోలు, వీడియోలు కలెక్ట్ చేసి మార్పింగ్ చేస్తున్నారని సీపీ సందీప్ శాండిల్య (Hyderabad CP) పేర్కొన్నారు. గుర్తు తెలియని వారితో చాటింగ్ చేయొద్దని మరీ మరీ సూచించారు. ఇటీవల జరిగిన రెండు ఉదంతాలను వివరించారు. ఫేస్ బుక్లో ఇద్దరు అమ్మాయిలను ట్రాప్ చేశారని తెలిపారు. తర్వాత వారిపై లైంగికదాడి చేశారని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేయొద్దని సూచించారు. లైక్స్, కామెంట్స్ మాయలో పడొద్దని కోరారు.
ఫోటోలు, వీడియోలు అస్సలు షేర్ చేయొద్దని సీపీ కోరారు. వాటిని సైబర్ కేటుగాళ్లు మార్పింగ్ చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ వేధింపులకు గురైన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. పోలీసులను కూడా కుటుంబ సభ్యులగా భావించాలని సూచించారు. తన మొబైల్ నంబర్ 871266 0001, పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 16555కి సమాచారం ఇవ్వాలని కోరారు. కంప్లైంట్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టంచేశారు.
పిల్లల గురించి పేరంట్స్ పట్టించుకోవాలని.. లేదంటే వారు ప్రమాదంలో పడతారని సీపీ చెబుతున్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు ప్రొఫైల్ పిక్ పెట్టొద్దని సీపీ కోరారు. ప్రొఫైల్ పిక్ లాక్ చేయాలని.. తెలియని వ్యక్తులతో వీడియో కాల్స్ మాట్లాడొద్దని.. ఫోటోలు షేర్ చేయొద్దని కోరారు.