హర్యానా(Haryana)లో కల్తీ మద్యంలో తాగి 19 మంది ప్రాణాలు కోల్పోయారు.యమునానగర్ జిల్లాలోని మందేబరి, పంజెతో కా మజ్రా, పూస్ఘర్, సరన్ గ్రామాల్లో మరణాలు సంభవించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు (Police) ఏడుగురిని అరెస్ట్ చేశారు. దీంతో స్థానిక గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. లిక్కర్ డీలర్ల (Liquor dealers)పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో లింకున్న ఏడు మందిని పోలీసులు అరెస్టు చేశారు. మందేబరి, పంజెతో కా మజ్రా, పూస్ఘర్, సరన్ గ్రామాల్లో మరణాలు సంభవించాయి. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ (CM Khattar) ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి. ప్రస్తుతం పోలీసులు అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంబాలా జిల్లాలో యూపీకి చెందిన ఇద్దరు కార్మికులు గురువారం కల్తీ మద్యం తాగి మరణించారు. ఓ నిషేధిత ఫ్యాక్టరీ(Factory)లో తయారు చేస్తున్న మద్యానికి చెందిన సుమారు 200 డబ్బాలను పోలీసులు సీజ్ చేశారు. లిక్కర్ తయారీకి వాడిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.