VKB: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకరోజు వర్క్ షాప్ను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డా. బి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కళాశాల బోటనీ, ఇంగ్లీష్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ‘సమీకృత విషయ అవగాహన- పాటించాల్సిన పద్ధతులు’ అనే అంశంపై ఈ సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రొఫెసర్లు వక్తలుగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేయనున్నారు.