MBNR: కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యత ఇస్తామని మహబూబ్నగర్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు శివరాజ్ తెలిపారు. బుధవారం డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో లైట్లు ఏర్పాటు చేయించినట్లు పేర్కొన్నారు.