Game changer: అనుకున్నట్టే చేశారు.. నిరాశలో చరణ్ ఫ్యాన్స్!
మొన్న గుంటూరు కారం సాంగ్ వచ్చింది.. నెక్స్ట్ దీపావళి గేమ్ చేంజర్‌తో తమన్ రచ్చ చేస్తాడని.. మెగా ఫ్యాన్స్ భావించారు. కానీ అనుకున్నట్టే మళ్లీ గేమ్ చేంజర్ సాంగ్‌ను పోస్ట్‌పోన్ చేశారు. నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది.
Game changer: అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే.. ఈపాటికే గేమ్ చేంజర్ (Game changer) థియేటర్లోకి రావాల్సి ఉంది. రోజు రోజుకి వెనక్కి వెళ్తునే ఉంది ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్. అసలు రామ్ చరణ్, శంకర్ కాంబోలో సినిమా అనగానే ఎగిరి గంతేశారు మెగాభిమానులు. అందుకు తగ్గట్టే.. ఊహించని స్పీడ్‌లో షూటింగ్ చేశాడు శంకర్. మధ్యలో ఇండియన్ 2 రావడంతో.. గేమ్ చేంజర్ గేమ్ స్లో అయిపోయింది. దాంతో అప్డేట్స్ కూడా స్లో అయిపోయాయి. ఈ సినిమా షూటింగ్ ఎక్కడి వరకు వచ్చిందనే విషయంలో క్లారిటీ లేదు. కానీ దసరా రోజున దీపావళికి జరగండి సాంగ్ రిలీజ్ చేస్తామని.. మెగా ఫ్యాన్స్‌ను కాస్త ఊరించారు. అంతేకాదు.. మ్యూజిక్ రైట్స్ కూడా అమ్ముడుపోయాయి.. నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేయడమే లేట్ అని అన్నారు. కానీ తీరా దీపావళి దగ్గరికి వచ్చాక.. మళ్లీ మొదటికి వచ్చేశారు. అనుకున్నట్టే.. గేమ్ చేంజర్ నుంచి సాంగ్ రిలీజ్ చేయడం లేదని అనౌన్స్ చేశారు.
త్వరలోనే జరగండి సాంగ్ రిలీజ్ చేస్తామని.. ప్రస్తుతానికి ఆడియో డాక్యుమెంటేషన్ సమస్యల కారణంగా సాంగ్ రిలీజ్ చేయడం లేదని చెప్పుకొచ్చారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ మళ్లీ డిసప్పాయింట్ అవుతున్నారు. సినిమానే అనుకుంటే పాట కూడా అంతేనా? అని ఫీల్ అవుతున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. గతంలో లీక్ అయిన సాంగ్ అనుకున్నంత రేంజ్లో లేదు. దీంతో ఈ సాంగ్ సింగర్‌ను మార్చినట్టుగా తెలుస్తోంది. అందుకే.. ఆలస్యం అని తెలుస్తుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే తమన్.. గేమ్ చేంజర్ మ్యూజిక్ పై ఎంత హైప్ ఇవ్వాలో అంతకు మించి అనేలా ఇచ్చేశాడు. కాబట్టి.. ఈ మ్యూజిక్ ఆల్బమ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి జరగండి సాంగ్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.