ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్(jr ntr) చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. కానీ దీని కంటే ముందే మరో సినిమాలో టైగర్ క్యామియో ఉంటుందనే న్యూస్ వైరల్‌గా మారింది.
ప్రజెంట్ దేవర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్(jr ntr). వీలైనంత త్వరగా దేవర షూట్ కంప్లీట్ చేసి.. నెక్స్ట్ వార్2 షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఆ తర్వాత వెంటనే సమ్మర్లో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. కానీ యంగ్ టైగర్ థియేటర్లోకి వచ్చేది మాత్రం ఏప్రిల్ 5నే. దేవర సినిమా ఆరోజే రిలీజ్ కానుంది. అప్పటివరకు యంగ్ టైగర్ బిగ్ స్క్రీన్ పై కనిపించే ఛాన్స్ లేదు. కాకపోతే త్వరలోనే అదుర్స్ రీ రిలీజ్ కాబోతోంది. కానీ ఈలోపే టైగర్3లో యంగ్ టైగర్ ఎంట్రీ ఉంటుందనే న్యూస్.. నందమూరి ఫ్యాన్స్‌ను టెంప్ట్ చేస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ 3(tiger3). యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా.. మనీష్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తారక్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. క్లైమాక్స్‌లో వార్2కి లీడ్ ఇచ్చేలా.. ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ ‘వార్2(war2)’లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో యష్ రాజ్ స్పై యూనివర్స్‌లోకి అడుగుపెట్టనున్నాడు. అందుకే.. వార్ 2లో రా ఏజెంట్‌గా పరిచయం కాబోతున్నట్లు సమాచారం.
ఒకవేళ ఇదే నిజమైతే.. యంగ్ టైగర్ ఫ్యాన్స్(fans)కు పండగే. దీపావళి కానుకగా నవంబర్ 12న హిందీ, తెలుగు సహా ఇతర భాషల్లో టైగర్2 విడుదల కానుంది. కానీ.. పబ్లిసిటీ కోసమే తారక్ పేరు వాడుతున్నారా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల వచ్చిన లియో సినిమాలో కూడా రామ్ చరణ్ ఎంట్రీ ఉంటుందని వినిపించింది. కానీ ఆ వార్తలన్నీ రూమర్స్‌కే పరిమితమయ్యాయి. కాబట్టి.. హైప్ కోసమే ఇప్పుడు ఎన్టీఆర్ పేరును వాడుతున్నట్టుగా టాక్ నడుస్తోంది. అందుకే.. ఈ న్యూస్‌ను అంత ఈజీగా నమ్మడం లేదు. మరి టైగర్ 3లో తారక్ ఉన్నాడో లేదో చూడాలి.