రిలయన్స్ మీడియా విభాగం జియోస్టార్ సీఈవో పదవికి కిరణ్ మణి రాజీనామ చేశారు. ప్రముఖ AI సంస్థ ఓపెన్ఏఐ నుంచి ఆఫర్ రావడంతో సంస్థను వీడారు. ఆసియా-పసిఫిక్ ఎండీగా జూన్‌లో కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. కిరణ్ మణి రాజీనామాను జియోస్టార్ వైస్‌ఛైర్మన్ ఉదయ్‌శంకర్ ధ్రువీకరించారు. ఉద్యోగులకు అంతర్గతంగా ఇ-మెయిల్స్ పంపారు.