Crime News : కుక్కను ఎవరైనా కుక్క అనే పిలుస్తారు. కాకపోతే కొందరు తమ పెంపుడు కుక్కలకు పేర్లు పెట్టుకుంటారు. అటువంటి వాళ్లు మాత్రం తమ పెంపుడు కుక్కను పెట్టుకున్న పేరుతో పిలుస్తారు. కానీ.. దానికి ఒక పేరు ఉందని వేరే వాళ్లకు తెలియదు కదా. అప్పుడు దాన్ని వాళ్లు కుక్క అనే పిలుస్తారు కదా. కానీ.. ఓ వ్యక్తి తన కుక్కను పేరుతో కాకుండా కుక్క అని పిలిచాడని.. ఏకంగా ఆ వ్యక్తినే చంపేశాడు కుక్క యజమాని. ఈ ఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో చోటు చేసుకుంది.
రాయప్పన్ అనే వ్యక్తి ఇంటి పక్కనే ఉండే ఓ ఇంట్లో ఓ కుక్క ఉంది. దానితో రాయప్పన్ చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. దాని గురించి చాలా సార్లు ఆ ఇంటి ఓనర్ కు చెప్పి చూశాడు కానీ.. ఆ ఇంటి ఓనర్ రాయప్పన్ ను పట్టించుకోలేదు. ఆ కుక్క ఇరుగుపొరుగు వారిపై కూడా అరవడం, ఇంటి ముందు నుంచి ఎవరు వెళ్లినా వాళ్లపై మొరగడంతో ఆ వీధిలోకి రావాలంటేనే స్థానికులు భయపడేవారట.
Crime News : రాయప్పన్ పై దాడి చేసి చంపేసిన కుక్క ఓనర్స్
ఒక రోజు రాయప్పన్ తన పొలం దగ్గరికి వెళ్తేందుకు తన మనవడు కెల్విన్ ను ఒక కర్ర తీసుకొని రమ్మన్నాడు. కుక్కకు భయపడి ఆ కుక్క కరుస్తుందేమో.. కర్ర తీసుకురా అంటూ తన మనవడికి చెప్పాడు. అది విన్న కుక్క ఓనర్ కొడుకులు డేనియల్, విన్సెంట్.. మా కుక్కను పేరుతో కాకుండా కుక్క అని పిలుస్తావా అని ఆవేశంతో అతడి మీద పడి దాడి చేశారు. దీంతో రాయప్పన్ అక్కడే కుప్పకూలి చనిపోయాడు. రాయప్పన్ చనిపోగానే అక్కడి నుంచి డేనియల్ ఫ్యామిలీ పరారయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.