TG: ఇందిరమ్మ ఇళ్లపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఈ నెలలో లక్షా 12 వేల ఇళ్లు పూర్తి కాబోతున్నాయని.. జూన్ నాటికి మరో లక్ష ఇళ్లు పూర్తవుతాయని చెప్పారు. ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. సగంలో వదిలేసిన గృహలక్ష్మీ ఇళ్లకూ నిధులిస్తున్నామని వెల్లడించారు. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు.