NLG: ఎస్సీ, ఎస్టీలకు అమల్లో ఉన్న అట్రాసిటీ చట్టం తరహాలో బీసీలకు కూడా ప్రత్యేక బీసీ పరిరక్షణ చట్టం తీసుకురావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. బుధవారం దేవరకొండలో నిరసన చేపట్టారు. బీసీలపై జరుగుతున్న దాడులు వివక్షలను అరికట్టే రక్షణ లేకపోవడం బాధాకరమన్నారు.