»This Week Is All Dubbing Movies Release In Telugu Movies
This week: మన సినిమా ఒక్కటి కూడా లేదు..ఈ వారం వాళ్లదే!
దసరా సీజన్లో నాలుగైదు భారీ సినిమాలు పోటీ పడ్డాయి. బాలయ్య 'భగవంత్ కేసరి', రవితేజ 'టైగర్ నాగేశ్వర రావు', విజయ్ 'లియో'తో పాటు బాలీవుడ్ నుంచి కూడా ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ దీపావళికి మాత్రం తెలుగు సినిమాలు ఒక్కటి కూడా రావడం లేదు.
This week is all dubbing movies release in telugu movies
దీపావళి టార్గెట్గా తెలుగు సినిమాలు పోటీ పడతాయనుకుంటే.. ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కావడం లేదు. నవంబర్ 12న దీపావళి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సినిమాలున్నప్పటికీ.. తెలుగు చిత్రాలు మాత్రం లేవు. అందుకే..ఈసారి డబ్బింగ్ సినిమాలదే హవా కనిపిస్తోంది. దీపావళి తెలుగు సినిమాల విషయానికొస్తే..దినేశ్ తేజ్ హీరోగా నటించిన ‘అలా నిన్ను చేరి’ అనే సినిమాను నవంబర్ 10న విడుదల చేస్తున్నారు. దీంతోపాటు తమిళ రాము వెంకట్, దీపన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దీపావళి’ చిత్రం నవంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే జనం అనే మరో చిన్న సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇక డబ్బింగ్ సినిమాలను చూస్తే.. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన ‘జపాన్’ సినిమా పై మంచి బజ్ ఉంది.
రాజు మురుగన్ దర్శకత్వంలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా నవంబర్ 10న రిలీజ్కు రెడీ అవుతోంది. ఇప్పటికే తెలుగులో గట్టిగా ప్రమోట్ చేశాడు కార్తి. ఇక్కడ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ వారు జపాన్ను డిస్ట్రీబ్యూట్ చేస్తున్నారు. ఇక రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య కీలక పాత్రల్లో నటించిన సినిమా హిట్ సీక్వెల్ ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’. పిజ్జా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 10న విడుదల కానుంది. ఇక బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ నటించిన స్పై యూనివర్స్ ‘టైగర్3’ 12న విడుదల కానుంది. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. మొత్తంగా ఈసారి దీపావళికి డబ్బింగ్ సినిమాలదే హవా అని చెప్పొచ్చు. అన్నట్టు..హాలీవుడ్ నుంచి ‘ది మార్వెల్స్ అమెరికన్ సూపర్ హీరో’ 10న తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది.