Dubbing Movies: జనవరి 26న ఇన్ని డబ్బింగ్ సినిమాలా?
సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు కచ్చితంగా ఉంటాయి. అయితే వీటి కారణంగా ఇతర భాష చిత్రాలకు చోటు దక్కలేదు. దాంతో అన్ని కలిపి జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
Dubbing Movies: ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఏకంగా 5 తెలుగు సినిమాలు నిలిచాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం, వెంకటేష్(Venkatesh) సైంధవ్, తేజ సజ్జ నటించిన హనుమాన్(Hanuman), మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈగల్తో పాటు కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఇక వీటి నడుమ డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. తెలుగు చిత్రాలే బోలెడు ఉన్నాయి కాబట్టి వాటికి చోటు దక్కలేదు. కనీసం ఒక్క తెలుగు సినిమా అయినా వెనక్కి తగ్గితే 4 చిత్రాలకూ మంచి జరుగుతుందని నిర్మాతలు భావించారు. అలాగే విడుదల వాయిదా వేసుకొనే ఆ సినిమాకీ జనవరి 26 రిపబ్లిక్ డే నాడు సోలో రిలీజ్ అవకాశం కల్పిస్తామని చెప్పినా ఎవ్వరూ తగ్గలేదు. దీంతో సంక్రాంతి నాడు డబ్బింగ్ చిత్రాలు విడుదలకు నోచుకోలేదు.
అలాగే జనవరి 26న కూడా 5 డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. చియాన్ విక్రమ్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తంగలాన్ జనవరి 26న విడుదల కానుంది. రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ కూడా రిపబ్లిక్ డే రోజే రిలీజ్కు సిద్ధం అయింది. ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ తమిళంలో జనవరి 12న విడుదల అవుతుంది. తెలుగులో గణతంత్ర దినోత్సవం రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. హన్సిక ప్రధాన పాత్రలో నటించిన 105 మినిట్స్, మోహన్ లాల్ నటించిన మలైకోటై వాలిబన్, హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రాలు జనవరి 25న రానున్నాయి.