Captain Miller: ధనుష్ కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ ఎలా ఉందంటే?
తమిళ హీరో ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్ విడుదల అయింది. రియల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రక్తపాతం అయితే ఫుల్‌గా ఉంది.
Captain Miller: తమిళ హీరో ధనుష్(Dhanush) తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్(Captain Miller) ట్రైలర్ విడుదల అయింది. బ్రిటీష్ నాటి కాలంలో జరిగిన కొన్ని రియల్ ఇన్స్డెంట్స్ని ఆధారంగా చేసుకొని అరుణ్ మాదేశ్వరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్లుకుంటుంది. విడుదలైన గంటల వ్యవధిలోనే మిలియన్ల్ వ్యూస్‌ని సొంతం చేసుకొని యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇక కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని జనవరి 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, తెలుగు హీరో సందీప్ కిషన్, బ్యూటీఫుల్ హీరోయిన్ ప్రియాంక మోహన్ తదితరులు నటిస్తున్నారు.