చియాన్ విక్రమ్ 'ధృవనక్షత్రం' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ఈ నెల 24న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్లో విక్రమ్ నటన, యాక్షన్ విజువల్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 26వ తేదిన విడుదల కానుంది. అంతకంటే ముందుగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ధృవ నక్షత్రం మూవీని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. తమిళ్లో ధృవ సచ్చత్తిరం అనే పేరుతో విడుదల అవుతోన్న ఈ మూవీ స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో జాన్ అనే స్పై క్యారెక్టర్లో విక్రమ్ కనిపించనున్నాడు.
‘ధృవ నక్షత్రం’ మూవీ ట్రైలర్:
2017లోనే ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. కానీ అప్పటి నుంచి అది పెండింగ్ పడుతూనే ఉంది. ఇక ఇప్పుడు నవంబర్ 24వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ మూవీ ట్రైలర్ను కాసేపటికి క్రితమే విడుదల చేశారు. తెలుగు ట్రైలర్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో విక్రమ్ నటన, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అన్నీ అదిరిపోయాయి.
ముంబై పేలుళ్ల గురించి, కాశ్మీర్లో చేపట్టే ఎన్ఎస్ఎస్ మిషన్ గురించి ట్రైలర్లో అద్భుతంగా చూపించారు. విక్రమ్ స్టైలిష్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ధృవ నక్షత్రం మూవీలో రీతూ శర్మ హీరోయిన్గా చేస్తోంది. ఇంకా ఇందులో భారీ తారగణం నటిస్తున్నారు. ఐశ్వర్యా రాజేశ్, సిమ్రాన్, రాధిక, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.