AP: రాజధాని అమరావతిలో ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. తాజాగా హెచ్వోడీ టవర్-3 కార్నర్ నోడ్ అమర్చే పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర స్థాయి అధికారులంతా ఒకే చోట అందుబాటులో ఉండేలా, సచివాలయం కోసం ఈ ఐకానిక్ టవర్లను అత్యద్భుతంగా డిజైన్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.