కామారెడ్డి పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని సినీ నటుడు వెన్నెల కిశోర్ అన్నారు. కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ పున్న రాజేశ్వర్ కుటుంబ సభ్యులను ఆయన కుటుంబ సమేతంగా మంగళవారం సాయంత్రం కలిశారు. వెన్నెల కిశోర్ మాట్లాడుతూ.. పున్న రాజేశ్వర్తో తమకు బందుత్వం ఉందన్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం పట్టణానికి వస్తామన్నారు.