SRD: ఖేడ్ మండలం హనుమంతరావుపేట గ్రామంలో కొనసాగిన మల్లికార్జున స్వామి జీవిత చరిత్ర వీధి నాటకం నేడు తెల్లవారుజామున ఘనంగా ముగిసింది. ఇందులో మల్లన్న దేవుడు, నీలమాంబ దేవి, ఆదిరెడ్డి రాజు, మైసమ్మ, వన్నెల అక్కమ్మ, మల్లికార్జున స్వామి, రత్నాంగి, భ్రమరాంబిక పాత్రలు పోషించి అద్భుతంగా నటించిన గ్రామ కళాకారులకు, నాటక నిర్వహణ కర్త చందుబట్ల రాములును సన్మానించారు.