డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. అందుకే..తన గురించి ఎలాంటి ఫేక్ ప్రచారం జరిగినా క్షణాల్లో రిప్లే ఇస్తాడు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ జరుగుతున్న రూమర్స్ పై మండి పడ్డాడు హరీష్.
గబ్బర్ సింగ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. హరీష్ శంకర్(Harish Shankar), పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh)’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ అదిరిపోయింది. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఏదో ఒక పుకారు వస్తునే ఉంది. ఆ మధ్యన ఏకంగా ఆగిపోయిందని అన్నారు. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని పక్కకు పెట్టేసినట్టుగా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో.. రవితేజతో ఓ మూవీ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై హరీష్ శంకర్ సాలిడ్ క్లారిటీ ఇచ్చారు.
ఓ సీనియర్ జర్నలిస్ట్ వేసిన ట్వీట్‌కు రిప్లే ఇస్తూ..పవన్ కళ్యాణ్(pawan kalyan) మూవీ నుంచి తాను తప్పుకోవడం, రవితేజతో సినిమా చేయబోతుండటం.. రెండు అబద్ధలేనని ట్విట్టర్ ద్వారా కౌంటర్లు వేశాడు. ఈ అవేశమే తగ్గించుకుంటే మంచిదని సెటైర్ వేశాడు. మొత్తంగా హరీష్ శంకర్ ఈ సినిమా ఆగిపోలేదు అని సాలిడ్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పుడే కాదు.. ఎప్పటికప్పుడు ఇలాంటి పుకార్లకు చెక్ పెడుతునే ఉన్నాడు హరీశ్. అయినా కూడా పవన్ పాలిటిక్స్ కారణంగా రూమర్స్ ఆగడం లేదు. అయితే.. చాలా కాలంగా పవన్ కోసం వెయిట్ చేస్తున్నాడు హరీష్ శంకర్. అలాంటిది సినిమా సెట్స్ పైకి వెళ్లడమే కాకుండా.. కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అలాంటప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది, హరీష్ తప్పుకున్నాడు అనే ఫేక్ ప్రచారం వేస్ట్. అయితే.. ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.