నారాయణపేట జిల్లాలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నేతలు నారాయణపేట జెడ్పీ సీఈవో మొగులప్పకు వినతిపత్రం అందించారు. నాలుగేళ్లుగా ఈ నియామకాలు జరగడం లేదని సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జీపీఎఫ్ చెల్లింపులు వేగవంతం చేసి, ఆన్లైన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరారు.