NLR: ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం రాత్రి ఓ మహిళ ఆందోళనకు దిగింది. తన భర్త వేమయ్యను ఎస్సై అకారణంగా కొట్టారంటూ పాలకొండసత్రానికి చెందిన నందిని అనే మహిళ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.