VZM: బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామని బొబ్బిలి పట్టణ CI కే. నారాయణరావు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, ITI కాలనీలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిని పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. యువత మంచి మార్గంలో నడవాలని, చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.